- అక్టోబర్ 14, 15 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్న శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులు
పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులు ఈ నెల సెప్టెంబర్ 9,10 తేదీలలో నెల్లూరు జిల్లాలో జరిగిన షూటింగ్ బాల్ పోటీలలో కారంపూడి శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులు పాల్గొని జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సీనియర్ విభాగం నందు మరియు మెయిన్ విభాగం నందు కె.ఉదయ్ కిరణ్ 9వ తరగతి విద్యార్థి మరియు ఎం.అరవింద్ వీరు ఇద్దరు మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయిలో పోటీలకు ఎంపిక కావడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపాల్ శుక్రవారం తెలియజేశారు అంతేకాకుండా ఈ జాతీయస్థాయి పోటీలు వచ్చేనెల అక్టోబర్ 14,15 తేదీలలో న్యూఢిల్లీలో జరుగు పోటీలకు మన రాష్ట్రం తరఫున కారంపూడి వివేకానంద హైస్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొననున్నారు అని అన్నారు మరియు శ్రీ వివేకానంద హైస్కూల్ విద్యార్థులు చదువు పట్ల గేమ్స్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని వీరిని ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ సిహెచ్ విశాలాక్షి, పిఈటి ప్రవీణ్, ఇంచార్జ్ సామేల్ మరియు స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ బృందం, మరియు కారంపూడి మండల ప్రజలు అభినందించారు.