- రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు బ్రహ్మ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారంపూడి విద్యార్థులు ఎంపిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆదివారం నరసరావు పేట లోనీ శంకర భారతి పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అండర్ 18 బాల,బాలికల జిల్లా జట్లు ఎంపికలు జరిగాయి.
https://amzn.to/3trNC35 – M.R.P.: ₹699 – Deal Price : ₹99
ఇందులో భాగంగా కారంపూడి బ్రహ్మ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారంపూడి కి చెందిన పదవ తరగతి చదువుతున్న షేక్ షారుక్,సి.హెచ్. నగవర్ధన్, కామాక్షి, అనూష లు తొమ్మిదవ తరగతి చదువుతున్న షాన్వాజ్ , ఎనిమిదవ తగతి చదువుతున్న ఏసమ్మ లు ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు కు ఎంపికైనట్లు పాఠశాల ప్రదానోపాధ్యాయులు అనంత శివ గారు తెలిపారు.
వీరు ఈనెల 20 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు చిత్తూరు జిల్లా యదమరి గ్రామం లో జరుగు రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీల్లో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు స్వర్ణ రాజు, శ్రీనివాసరావు లు తెలియజేశారు.
అనంతరం గురువారం పాఠశాలలో క్రీడాకారులకు జరిగిన అభినందన సభ లో ఉపాధ్యాయనీ, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.
https://amzn.to/3rx3XTR – M.R.P.: ₹999 – Deal Price : ₹290