కరీంనగర్ జిల్లా: కానిస్టేబుల్ ఫలితాల్లో యువకులు ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ ఫలితాలు గుండ్లపల్లి కి చెందిన అజయ్. యాస్వాడ కు చెందిన దానవేణి వినయ్, గన్నేరువరం కు చెందిన ముత్యం అఖిల్ గౌడ్ లు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ గా తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. అలాగే యాస్వాడ కు చెందిన వడ్లూరి రాజేష్ ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. మండల కేంద్రం గన్నేరువరం చెందిన కొట్టే మౌనిక, కొట్టే సాయి కృష్ణ, రాపోలు కనకలక్ష్మిలు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారు. మౌనిక, సాయి కృష్ణ అక్క తమ్ముడు కాగా ప్రస్తుతం గ్రూప్ 1, 2 ల పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాగే మీసం మహేష్ కవ్వంపల్లి పవన్లు ఆర్మీలో ఉద్యోగాలను సాధించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించడం పట్ల మండల కేంద్రం గన్నేరువరంకు చెందిన యువకులు వారి తల్లిదండ్రులను బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాత సుధాకర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి అభినందించారు, ఈ కార్యక్రమంలో మీసాల ప్రభాకర్,నక్క దామోదర్,తెల్ల తిరుపతి,మందాల సాగర్, కడే హనుమంతు, కూన విజయ్, తదితరులు పాల్గొన్నారు.
https://amzn.to/3rvtAo5 – Discount :84% – Deal Price : ₹245
M.R.P.: ₹1,499