కరీంనగర్ జిల్లా గన్నేరువరం లో రేషన్ డీలర్ అంజయ్య అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ది రిపోర్టర్ టివి ప్రతినిధి రాజ్ కోటి చేశారు.
https://amzn.to/46HN87z – Deal Price : ₹11,999 – M.R.P.: ₹16,499 –
వివరాల్లోకి వెళితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన “E -KYC” నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరగా, దీన్ని ఆసరాగా చేసుకొని డీలర్ అంజయ్య, ఒక్క రేషన్ కార్డు పేరు మీద కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఒక్కొక్కరి పై పది రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడు. డీలర్ అంజయ్యను వివరణ కోరగా ప్రభుత్వం మాకు ఇవ్వదని అందుకే డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పాడు. డబ్బులు ఇవ్వకుంటే రేషన్ బియ్యం ఇవ్వడం లేదని బాధితులు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి డీలర్ అంజయ్య పై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.