కరీంనగర్ జిల్లా: ఈకేవైసీ చేయడానికి మండల కేంద్రం గన్నేరువరం కు చెందిన రేషన్ డీలర్ అంజయ్య లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్న కథనాన్ని ది రిపోర్టర్ టీవీ ప్రచురించింది. స్పందించిన అధికారులు శుక్రవారం సంబంధిత రెవెన్యూ సిబ్బంది రేషన్ షాపును ఆర్ఐ రజిని కుమార్ షాపును పరిశీలించి, పంచనామ చేసారు. ఈ నీవేదికను డిఎస్ఓ తోపాటు ఆర్డీవోకు పంపించనున్నట్లు తాసిల్దార్ భిక్షపతి తెలిపారు. రేషన్ డీలర్లు ఈకేవైసీ కి కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని. ప్రజలు ఇలాంటి వాటిపై తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.