- 144 సెక్షన్ కన్నా, ఏనుగుల తరలించడమే మిన్న
- అడవి శాఖ అధికారులకి విన్నపం
- ఏనుగులు తరలించి ప్రజల ప్రాణాలు, పంటలను కాపాడాలంటే 144 సెక్షన్ల విధిస్తారా???
- అరేళ్లుగా ఏనుగుల వల్ల అడవిశాఖ అధికారులకు, రైతాంగానికి ఏమైనా భరోసా ఉందా???”
పార్వతిపురం మన్యం జిల్లా, కొమరాడ, ది రిపోర్టర్ న్యూస్ ప్రతినిధి: 144 సెక్షన్ వల్ల రైతులెవ్వరు పొలాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదని ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండకూడదని ఎవరింట్లో వాళ్ళు ఉండాలని ఒక్కొక్కరు వెళ్లేటప్పుడు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఏనుగులు తరలించం కోసం 144 సెక్షన్ విధిస్తామని ఇది అడవి శాఖ అధికారులు కొత్తగా ప్రజలకి చెప్పడం విడ్డురంగా ఉంది.
ఎన్నాళ్ళు ఈ 144 సెక్షన్ విధిస్తారు:
ఆరు సంవత్సరాలో ఏనుగుల వల్ల 11 మంది చనిపోగా మూడు కోట్ల ఆస్తి, పంట నష్టం వ్యవసాయ సామగ్రి నష్టం జరుగుతుంటే ఇంకా ఏనుగులు తరలించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో సంబందించిన శాఖ వారికీ తెలియాలి.
ఇప్పటికైనా 144 సెక్షన్ కన్నా ఏనుగులు తరలించడమే మిన్న ముఖ్యంగా వ్యవహరించడంతో పాటు మిగతా ఏనుగులను అడవికి లేదా జూకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ.. గడిచిన ఆరు ఏళ్ళ కాలంగా అటు ఒరిస్సా నుండి మన ఆంధ్ర శ్రీకాకుళం మీదుగా కురుపాం నియోజకవర్గానికి వచ్చిన ఏనుగులు వల్ల నేటికీ 11 మంది చనిపోగా పంట,ఆస్తి నష్టం సుమారు మూడు కోట్లు పైగా తీవ్రంగా జరిగిందని ఇలాంటి సందర్భంలో అడవి శాఖ అధికారులు ఏనుగుల వెనకాల ఆరు సంవత్సరాల కాలం పాటు తిరగడమే తప్పఈసంత ఉపయోగం లేదని,ఇంత జరుగుతుంటే అడవి శాఖ అధికారులు ఏనుగులు తరలించే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి గాని పాలకులకు గాని ఒత్తిడి తేవాలి తప్ప ఈరోజు 144 సెక్షన్ విధించాం ప్రజలు ఎవరూ బయటికి రాకూడదని, పొలాలకు వెళ్ళకూడదని, ఒంటరిగా వెళ్ళాలి,గుంపులగా కలిసి ఉండకూడదని ఉచిత సలహాలు ఇస్తున్నారే తప్ప ఏనుగులను తరలించే విధంగా ఒక్క అడుగు ముందుకు వేయడం లేదని ఇదేనా అడవి శాఖ అధికారులు రైతులకు ఇచ్చిన భరోసా అని ఆరోపించారు.
144 సెక్షన్ వద్దు ఏనుగులు తరలిస్తే ముద్దు
కావున వెంటనే ఏనుగులను అడవికి లేదా జూకి తరలించాలని మరి ముఖ్యంగా హరి అనే ఏనుగు తక్షణమే విశాఖపట్నం జూకి తరలించాలని అలాగే మిగతా ఏనుగులు కూడా తరలించాలని ఈ విధంగా ఏనుగుని అడవికి లేదా జూకి తరలించి ప్రజల ప్రాణాలను రైతులు పండించిన పంటలను కాపాడాలు తప్ప ఈరోజు 144 సెక్షన్ విధించి ప్రజలపై రైతులు పైన ప్రాణం ఉన్నట్లు అడవిశాఖ అధికారులు నటించడం చాలా హాస్యస్పదంగా ఉందని కావున వెంటనే అడవి శాఖ అధికారులు ఏనుగులను అడవికి లేదా జూకి తరలించే విధంగా చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వము గాని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు గాని ఏనుగులు తరలించే విధంగా అడవి శాఖ అధికారులకి పూర్తి సహకారం అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వెంటనే ఏనుగులను అడవికి లేదా జూకి తరలించకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అడివి శాఖ అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివుని నాయుడు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
BSB HOME Microfibre All Season/AC/Summer Solid Reversible Double Bed Comforter Blanket | Blanket | Dohar | Duvets – (220 GSM, Aqua and Blue)
Deal Price : ₹749 – M.R.P.: ₹2,999
https://amzn.to/3ZPNmY8