మంచిరియల్ జిల్లా : చెన్నూర్ పట్టణంలో అధికారులు ఎన్నికల నియమావళి నీ అమలు చేయడం లేదని స్థానిక బి. జె.పి. నాయకులు రిటర్న్ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి టౌన్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ మా ఇంటి గోడకు ఉన్న కమలం పువ్వు గుర్తును నా అనుమతి లేకుండా తీసివేయడం వేయడం జరిగింది. ఎలక్షన్ నియమావళి ప్రకారం ఇంటి యజమాని అనుమతి తప్పనిసరి ఉండాలి. కాని చెన్నూర్ పట్టణంలో అధికార పార్టీ కీ తొత్తులుగా వ్యవహరిస్తున్నరని అన్నారు . చాలా చోట్ల ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫ్లెక్స్ లు తీసివేయకూండా కేవలం బిజెపి కి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడం కక్షపూరిత చర్యగా ఉందన్నారు . దీనికి బాధ్యులైన చెన్నూర్ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది శేఖర్ మీద శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్,కొరుకొప్పుల వంశీ,శివ కృష్ణ,గడ్డిపెల్లి సంతోష్,దమ్మా సంజయ్,అక్షిత శర్మ,గడ్డం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.