కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ లో శ్రీ వాగ్దేవి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు,ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు బతుకమ్మ పాటలతో ఎంతో ఆనందోత్సాహాలతో కోలాటాలతో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూట్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఎల్లయ్య, జ్యోతి, స్వప్న, లాస్య,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.