కరీంనగర్ జిల్లా: వైఎస్ఆర్ టిపి అభ్యర్థిగా మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన సంపతి ఉదయ్ కుమార్ వైఎస్.ఆర్.టి.పి అధికార ప్రతినిధి పిట్ట రామ్ రెడ్డికి బుధవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. మానకొండూర్ నియోజకవర్గం లోని ఐదు మండలాలతో పాటు గన్నేరువరం మండలంలో ఉన్న సమస్యలు డబుల్ రోడ్డు ,గృహలక్ష్మి , దళితబంధు కోసం ఉదయ్ కుమార్ ప్రజల కొరకు అనేక పోరాటాలు చేస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల మెప్పు పొందారు. ఈసారి మానకొండూరు నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదిస్తే భారీ మెజార్టీతో గెలిచి ప్రజల సమస్యలు తీరుస్తానని పేదవారికి న్యాయం చేస్తానని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చిన బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈసారి బిఆర్ఎస్ కు డిపాజిట్ గల్లంతు అవుతాయని అన్నారు. మానకొండూర్ లో కాంగ్రెస్, వైఎస్ఆర్ టిపి మధ్య పోటీ ఉంటుందన్నారు. తమకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు.