కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈకార్యక్రమానికి బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఖాసీంపెట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం బిజెపి మండల అధ్యక్షులు నగునూరి శంకర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమురయ్య మండల ప్రధాన కార్యదర్శి, జాలి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు బోయిని మల్లయ్య,బుర్ర సత్తయ్య, కూన లక్ష్మణ్, శ్రీను, నాగభూషణం గ్రామ ప్రజలు మరియు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.