- న్యాయం గెలవాలని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్న టిడిపి ఎస్టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు
దొన్ను దొర
అల్లూరి జిల్లా, హుకుంపేట:-అరుకులోయ మండలంలోని పద్మపురం పంచాయతీ భీముడువలస గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర ఆధ్వర్యంలో సోమవారం “బాబు మేము”నిజం గెలవాలి” అనే కార్యక్రమంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కు అక్రమం గా అరెస్ట్ చేసి నేటికీ సుమారు 50రోజులు అవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగిస్తుందన్నారు. నిరుద్యోగులకు ప్రతి ఏటా డీఎస్సీ జాబ్ కేలండర్ ప్రకారం తీస్తానని చెప్పి యువతీ యువకులకు జగన్ మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోలు కల్పించేందుకు వైసిపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓటమి భయంతోనే కాక్ష పూరితంగా చంద్ర బాబు నీ జైలులో పెట్టారని ఎద్దేవా వేచేశారు.
వచ్చి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు భయపడి టీడీపీ నేతల పై రాష్ట్ర ప్రభుత్వం కాక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజల పరిపాలన విధానంపై దృష్టి సారించకుండా ప్రతిపక్షాలపై దృష్టి సారించడం సరికాదు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నేటికీ విద్య వైద్యం రహదారి త్రాగునీరు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేక నేటికీ కోకో కోలాలుగా ఉన్నాయని ఆయన్నారు.
20 24 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి గెలుపు ఖాయమని ప్రజలే సమర గీతం మోగిస్తున్నారు అన్నారు. వైసిపికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆయన చరించారు.ఈ కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్ దాసుబాబు పద్మపురం మాజీ సర్పంచ్ మహదేవ్ భూర్జ లక్ష్మి బొరి బోరీ లక్ష్మి వార్డు మెంబర్ గంగమ్మ,తులవతీ తెదేపా నాయకులు చందు,అర్జున్, గోనో,సుబ్బారావు జగన్ కుమార్, నాగరాజు,కార్యకర్తలు రాము,రాజు గ్రామస్థులు పాల్గొన్నారు.