కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలోఎన్నికల ప్రచారంలో కవ్వంపల్లి సత్యనారాయణ కి మహిళాలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మాజీ సర్పంచ్ సంగు దేవయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రాంరెడ్డి మరియు పలువురు బిఆర్ఎస్ నాయకులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,ఈ సందర్బంగా కవ్వంపల్లి తెలంగాణాలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఒక కేసిఆర్ కుటుంబానికే జరిగింది. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణాలో అభివృద్ధి అంత ఒక కేసిఆర్ కుటుంబానికే పరిమితమైంది. నీళ్ళు, నిధులు, నియమాకాలంటూ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించింది. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు.బిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన కొనసాగిస్తుతున్నారు.
అమరుల ఆశయాలను తుంగలో తొక్కి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కమీషన్ల రూపంలో అక్రమంగా కోట్లాది రూపాయలు కూడబెట్టిండు.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఈ తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రజల దగ్గర నుండి దోచుకోవడం,ఇసుక మాఫియా,భూకబ్జాలతోనే వారికి సమయం సరిపోయింది. ఇక ప్రజల కష్టాలు తీర్చడానికి సమయం ఎక్కడ ఉన్నది అని అన్నారు, స్థానికేతారుడిని మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.