తూర్పుగోదావరి జిల్లా : తాళ్ళపూడి మండల రెవిన్యూ సిబ్బంది పై ఏ.సి.బి వేసిన వలలో డిప్యూటీ తహసీల్దార్ మరియు వి.ఆర్.ఓ లు 7 వేళా రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం ఏ.సి.బి ఆడిషనల్ ఎస్పీ సౌజన్య అద్వర్యం లో మలకపల్లి సచివాలయం లో వి.ఆర్.ఓ పై దాడి చేశారు. మలకపల్లి గ్రామానికి చెందిన జి.వీర్రాజు అనే రైతు తన తండ్రి కి సంబంధించిన 10 సెంట్లు భూమి (22ఏ ) ప్రభుత్వ భూమి గా నమోదు అయిందని, లోన్ కోసం బాంక్ కు వెళ్లేందుకు తన భూమి వివరాలు సరి చేయాలని వి.ఆర్ శ్రీనివాస్ ను కోరారు. డిప్యూటీ తహసీల్దార్ ను కలవమన్నారని, ఆయన ఈ పని చేసేందుకు చాలా విధానం ఉందని, తహసీల్దార్ కు చెప్పి ప్రత్యామ్నాయం గా సర్టిఫికెట్ ఇప్పిస్తామని, అది లోన్ కు వినియోగపడుతుంద ని, ఈ పని కోసం 10 వేలు ఖర్చు అవుతుందని తెలిపారని, చివరకు 7 వేల రూపాయలు ఇస్తే చేస్తామని ఒప్పదం కుదుర్చుకుని మలకపల్లి సచివాలయం వద్ద డబ్బు పుచ్చుకున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆఫీసు కు వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ ను విఆర్ఓ ను అదుపు లోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పని కోసం లంచం అడిగితే 14400 కి కాల్ చెయ్యండి లేదా రాజమహేంద్రవరం లో గల ఆఫీస్ లో నేరుగా పిర్యాదు చేయవచ్చని సౌజన్య తెలిపారు.