contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కల్తీలకు కేరఫ్ కారంపూడి.. జోరుగా కల్తీ నూనె ప్యాకిట్ల అమ్మకం !

  • కారంపూడిలో జోరుగా కల్తీ నూనె ప్యాకిట్ల అమ్మకం…
  • ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్న కొందరు కిరాణా వ్యాపారులు
  • మామూళ్ల మత్తుకు అలవాటు పడి పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్, తునికలు కొలతల శాఖ అధికారులు

 

కల్తీలకు కేరఫ్ గా మారింది పల్నాడు రణక్షేత్రం కారంపూడి. నరసరావుపేట కేంద్రంగా తయారు అవుతున్న నకిలీ నూనె ప్యాకిట్లు అమ్మకం కారంపూడిలో కలకలం రేపుతుంది. కొందరు కిరాణా షాపు యజమానులు భారీ ఎత్తున ఈ నూనెను అమ్మి సొమ్ము చేసుకుంటూ అతి కొద్దీ కాలంలోనే లక్షదికారులుగా మారుతున్నారు. ఈ నకిలీ నూనె ప్యాకిట్ల వ్యాపారులకు ప్రజల ఆరోగ్యం గురించి పట్టనేపట్టడు. ఎవరు ఎలా పోతే మాకు ఏంటి అని కారంపూడిలోని బడా కిరాణా వ్యాపారులు కొందరు ఈ నూనెను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. నూనె అనేది నిత్యం మనం ఆహార పదార్దాలలో వినియోగిస్తాం బి.టీ విత్తనాలతో తయారు అయ్యే నూనె వాడితే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఈ నకిలీ నూనె ప్యాకిట్లు పట్టుపడటం జరిగింది. కారంపూడి కేంద్రంగా కొందరు కిరాణా వ్యాపారులు అధికారులకు మమ్ముళ్లు ఇస్తూ యద్దేచ్చగా వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. కారంపూడిలోని పెద్దపెద్ద హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారులకు ఈ నకిలీ నూనె ప్యాకిట్లు కిరాణా వ్యాపారులు జోరుగా అమ్ముతున్నట్లు కారంపూడిలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా బిటీ పత్తివిత్తనాలు తదితర వాటితో ఆయిల్ తీసి వాటిని ప్రముఖ బ్రాండ్లతో షాపులకు కూడా కిరాణా వ్యాపారులు అందిస్తున్నారు. కారంపూడి మండలంలో ఈ నూనె ప్యాకిట్ల అమ్మకం జోరుగా సాగుతున్న సంబంధిత అధికారులు నకిలీ నూనె వ్యాపారులకు అండగా మద్దత్తుగా ఉంటున్నారన్న విమర్శలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తునికలలో కూడా ఇక్కడ నూనె ప్యాకిట్లలో వ్యత్యాసం కనబడుతుందని పలువురు వాబోతున్నారు. వాస్తవంగా ఆయిల్ ప్యాకెట్ ఒక లిటిల్ అని కిరాణాషాపుల వారు విక్రాయిస్తుండగా లీటర్ కి 925 గ్రాములు ఉండవలసి ఉండగా 796, 810 గ్రాములు మాత్రమే ఉంటూ అధిక ధరలతో అమ్మకాలు ఇక్కడ భారీగా జరుగుతున్నాయి. ఆహార భద్రత అధికారులు కానీ, తునికలు కొలతల అధికారులు కానీ ఏనాడు కారంపూడి కిరాణాషాపులలో దాడులు చేసిన సందర్భాలు ఎప్పుడు కూడా కనిపించని పరిస్థితి. ఇక్కడ కల్తీ నూనె వ్యాపారులు తుకంలో వ్యత్యాసంతో అమ్మే వ్యాపారులు ఆహార తనిఖీ అధికారులకు, తునికలు కొలతల శాఖ అధికారులకు భారీ మొత్తంలో నెలవారి మామూళ్లు అందిస్తున్నరన్నా ప్రచారం కూడా కారంపూడిలో జోరుగా వినిపిస్తుంది. ఇటీవల పల్నాడు ప్రాంతానికి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ కారంపూడి వచ్చి కిరాణాషాపులు తనికి చేయకుండా రెస్టారెంట్లను తనిఖీ చేసి కల్తీ నూనె వాడుతున్నారని ఒక రెస్టారెంట్ పై తుతూ మంత్రంగా కేసు నమోదు చేసి కారంపూడి రెస్టారెంట్ లో మామూళ్లు వసులు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లారని సమాచారం. కారంపూడి మండలంలో నరసరావుపేట కేంద్రం నుండి రవాణా అవుతున్న నకిలీ నూనె ప్రతి రెండు రోజులకి ఒకసారి రెండు మూడు వ్యానులకు సరిపడా ఆయిల్ అమ్ముడుపోతున్న నకిలీ నూనె పై అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఒక వైపు ఆహార పదార్దాలలో ఇటువంటి కల్తీ నూనె వాడటం వలన ప్రజలు అనారోగ్యానికి గురి అవుతారన్న విషయం ఆహారభద్రత అధికారులకు, తునికలు కొలతల అధికారులకు తెలిసినప్పటికి తమ మామూళ్లు తమకు అందుతున్నాయి తమకు ఎందుకు లే అన్నట్లుగా పట్టిపట్టనట్లు సంబంధిత అధికారులు వ్యవహారిస్తున్నారు. అంతేకాకుండా కారంపూడిలోని కిరాణాషాపు యజమానులు కొందరు నూనె ప్యాకిట్లు సీల్ వేసే మిషిన్లు కూడా రహస్యంగా వాడుతూ వీటి ద్వారా ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాండ్లలో ఆయిల్ ను తగ్గిస్తు మళ్ళీ సీల్ చేస్తున్నారని దీని వలనే నూనె ప్యాకిట్లో భారీ వ్యత్యాసం కనపడుతుందని కొందరు వినియోగదారులు బహటంగానే విమర్శిస్తున్నారు. కల్తీ నూనెకు కేరఫ్ గా మారిన కారంపూడిలోని కొన్ని కిరాణాషాపుల పై విజిలెన్స్ అధికారులు రాష్ట్రా ఫుడ్ సేఫ్టీ అధికారులు, తునికల కొలతల శాఖల అధికారులు దాడులు నిర్వహించి నకిలీ నూనె ప్యాకిట్ల వ్యాపారుల అట కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు చెప్పట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :