- మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
- గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, చొక్కారావుపల్లి, కూనబోయినపల్లి, చాకలివానిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
- కాంగ్రెస్ మాయలో పడి ప్రజలు ఆగం కావొద్దు
- అరవై ఏళ్లలో చేయని అభివృద్ధి ఒక్క చాన్స్ ఇస్తే కాంగ్రెస్ ఎం చేస్తుంది
- బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
కాంగ్రెస్ హామీలకు భరోసా లేదు…కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు బాధ్యత, సంస్కారం లేదని గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, చొక్కారావుపల్లి, కూనబోయినపల్లి, చాకలివానిపల్లి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన యువకులు,నాయకులు బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతులు ఇతర ప్రాంతాలకు వలసవెల్లి బ్రతికే వారని…కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలో అభివృద్ధి సాధించిందని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు ఎకరాకు రూ.16వేలు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం, తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల భీమా సదుపాయం,సౌభాగ్యలక్ష్మీ ద్వారా నిరుపేద మహిళలకు రూ.3వేల సాయం, దివ్యంగులకు రూ.6000పెన్షన్, ఆసరా లబ్దిదారులకు రూ.5016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వమే స్థలాలను కొనిచ్చి, రూ.3లక్షల సాయం చేస్తామన్నారు.కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు..ఉన్న సంక్షేమ పథకాలలో కోతపెడతారని…కేసీఆర్ వస్తే 24 గంటల కరెంటు…సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు.ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయం చేస్తామని… దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి గంప మహేష్ బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మానకొండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు గడ్డం నాగరాజు,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న,గ్రామ ప్రజలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.