కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యాస్వాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఇంటింటా ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మూడు రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతానని మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు. అనంతరం గన్నేరువరం పెట్రోల్ బంకులో కవ్వంపల్లి సత్యనారాయణ పెట్రోల్ పోస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, చొక్కారావుపల్లి సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి, పెట్రోల్ బంక్ యజమాని వేదేరే అజయ్,దేశరాజు అనిల్, తదితరులు పాల్గొన్నారు.