హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోవాలని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మీరు ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాలా? ఇక మీ ఇష్టం. ఏం చేస్తారో మీ ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలను మీరు చూడాలి. మెజార్టీ ఇస్తే జైత్రయాత్రకు వస్తా.. లేదంటే నాలుగో తేదీన శవయాత్రకు మీరు రండి’ అన్నారు.