కరీంనగర్ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలకు గన్నేరువరం మండలంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా 17597 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రం గన్నేరువరంలో మహిళా మాడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పోలింగ్ బాక్స్ లతో సిబ్బంది ఆయా పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.