పల్నాడు జిల్లా , పిడుగురాళ్ళ : ఈరోజు క్యాప్కో (కన్ ఫెడరేషన్ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్) వారి ఆధ్వర్యంలో ది29-11-2023 వ తేదీన బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పిడుగురాళ్ల ఎంపీ జడ్పీ హైస్కూల్ నందు వినియోగదారుల హక్కులు బాధ్యతలపై, వినియోగదారుల చట్టం-2019పై ప్రధానోపాధ్యాయులు లింగాల ధనలక్ష్మి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశిస్తూ ముఖ్య అతిథిగా పాల్గొన్న నవ్యాంధ్ర కన్జ్యూమర్ రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మరియు పల్నాడు జిల్లా డీసీపీసీ మెంబర్ కే.కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి వినియోగదారుల వ్యవహారాలపై అవగాహన ఉండాలని, భారతదేశంలో మొదటిసారిగా 1986లో వినియోగదారుల రక్షణ చట్టం ప్రవేశపెట్టబడింది అని ఈ చట్టం ఐక్యరాజ్యసమితి రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేశారని ఈ చట్టం అమలులో లోపాలను గుర్తించి మరల 2019 వినియోగదారుల చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ద్వారా వినియోగదారుల రక్షణ కొరకై ఆరు హక్కులు కల్పించబడ్డాయని, అవి 1.ప్రమాదకరమైన వస్తువుల నుండి సేవలు నుండి తమను తాము రక్షించుకునే హక్కు 2. సమాచారం పొందే హక్కు 3. వస్తు సేవలు ఎంపిక చేసుకునే హక్కు 4. పరిష్కారం పొందే హక్కు 5. వినియోగదారుల వ్యవహారాలను తెలుసుకునే హక్కులు చట్టంలో పేర్కొన్నారని, ప్రస్తుతం మార్కెట్ మాయజాలంలో వినియోగదారులు నష్టపోతున్న విషయాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లింగాల ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం విద్యార్థులకు వినియోగదారుల వ్యవహారాలపై అవగాహన కల్పించడానికి వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కారణంగా హై స్కూల్ స్థాయిలో విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని ప్రత్యేకంగా క్లబ్స్ ఏర్పాటు చేశారని, ప్రతి వ్యక్తి వినియోగదారులుగా అవగాహన కలిగి ఉండి వ్యాపారస్తుల మోసాలకు గురి కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ బిల్లు అడిగి తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరు సౌరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు వినియోగదారుల చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని తూనిక కొలతల్లో మోసాలను గుర్తించాలని ఎక్స్పైరీ డేట్లు అధికధరల పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని మాట్లాడుతూ వచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు,స్కూలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.