హైదరాబాద్: తెలంగాణలో ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేశారని వార్తలలో దుమారం రేపుతున్నారు. మరి మిగతావారి పరిస్థితి ఏంటి ? సినీ ఇండస్ట్రీలో వీరు మాత్రమేనా ఓటు హక్కు ఉన్నవారు ? మిగతా సినీ , టీవీ రంగంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి ? ఏనాడైనా వారి గురించి పట్టించుకున్నారా ? సినీ , టివి ఆర్టిస్టులు , డైరెక్టర్లు , కో డైరెక్టర్లు, ఎడిటర్లు , సౌండ్ ఇంజినీర్లు , డబ్బింగ్ ఆర్టిస్టులు , డబ్బింగ్ స్టూడియోల ఓనర్లు, ప్రొడ్యూసర్స్ వీరంతా సినీ, టివి రంగాలలో పనిచేస్తున్న వారు కాదా!? లైట్ మెన్లు , ప్రొడక్షన్ , జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, డ్రైవర్లు, సింగర్లు, కాస్టూమ్ర్స్, మేక్ అప్ మ్యాన్ లు., ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటో మంది సినీ మరియు టీవీ రంగం లో జీవనం సాగిస్తూ ఓటు హక్కు ఉన్న వారు లేరా ? వీరందరూ ఏమయ్యారు ? వీరికి ఓటును వినియోగించుకునే హక్కు లేదా ? పనిలో ఉన్నారా ? లేక ఎక్కడ వీరు ? ఇకనైనా అధికారులు సంధించి తగు చర్యలు తీసుకోవాలని సినీ, టీవీ కార్మికులు.