అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఇంక గంటన్నర మాత్రమే సమయం ఉండడంతో ఓటు వేయని వారు త్వరగా పోలింగ్ బూత్‌లకు వచ్చి, ఓటేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.
మక్తల్ నియోజకవర్గంలో టెన్షన్ టెన్షన్:
మక్తల్ నియోజకవర్గం వర్కుర్ గ్రామంలో టెన్షన్ టెన్షన్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రామ్మోహన్‌తో పాటు వెళ్తోన్న అనుచరుల్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు బీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తీవ్ర వాగ్వాదంతో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రామ్మోహన్
కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత:
కొడంగల్ నియోజకవర్గంలోని రేగడి మైలారంలో ఉద్రిక్తత బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా నినాదాలు చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ
ఓటు వెయ్యలేకపోయిన సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం:
పాలేరు ఓటు వెయ్యలేకపోయిన సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం ఇటీవలే హైదరాబాద్ నుంచి సొంతూరు తెల్దారుపల్లికి ఓటు మార్చుకున్న తమ్మినేని వీరభద్రం. ఓటరు ఐడీలో తప్పుల కారణంగా ఓటు వెయ్యలేకపోయిన తమ్మినేని
వంకేశ్వరంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంకేశ్వరంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కర్రలు, రాళ్లతో జరిగిన పరస్పర దాడిలో ఇరుపార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఘర్షణ:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నారాయణతండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్‌లోకి వచ్చి ప్రచారం చేస్తున్నారని రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత:
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ డోర్నకల్ మండలం మల్లయ్యకుంటతండాలోని 247 పోలింగ్ కేంద్రం దగ్గర తన్నుకున్న కార్యకర్తలు ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
3 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..51.89
- అదిలాబాద్ 62.3
- భద్రాద్రి 58.3
- హనుమకొండ 49
- హైద్రాబాద్ 31.1
- జగిత్యాల 58.6
- జనగాం 62.2
- భూపాలపల్లి 64.3
- గద్వాల్ 64.4
- కామరెడ్డి 59
- కరీంనగర్ 56
- ఖమ్మం 63.6
- ఆసిఫాబాద్ 59.6
- మహబూబాబాద్ 65
- మహబూబ్ నగర్ 58.8
- మంచిర్యాల 59.1
- మెదక్ 69.3
- మేడ్చల్ 38.2
- ములుగు 67.8
- నగర కర్నూల్ 57.5
- నల్గొండ 59.9
- నారాయణపేట 57.1
- నిర్మల్ 60.3
- నిజామాబాద్ 56.5
- పెద్దపల్లి 59.2
- సిరిసిల్ల 56.6
- రంగారెడ్డి 42.4
- సంగారెడ్డి 56.2
- సిద్దిపేట 64.9
- సూర్యాపేట 62
- వికారాబాద్ 57.6
- వనపర్తి 60
- వరంగల్ 52.2
- యాదాద్రి 64