ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడంపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసారు
ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలతోనే తాను ఉంటానని రేవంత్ చెప్పారని… చెప్పిన విధంగానే ఆయన ప్రజల్లోకి వచ్చారని అన్నారు . జనాల్లో సీఎం ఉండటం కంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు.
అయన ట్వీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రజా సమస్యల పై మొట్టమొదటి సారిగా ప్రజా దర్బార్ నిర్వహించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు మీరు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. సీఎం స్వయంగా కూర్చొని సమస్యలను పరిష్కరించడం సంతోషకరం. తెలంగాణ బిడ్డలలో చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉన్నాయి. దయచేసి గమనించగలరని ట్వీట్ చేసారు.
@revanth_anumula ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రజా సమస్యల పై మొట్టమొదటి సారిగా ప్రజా దర్బార్ నిర్వహించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు మీరు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. సీఎం స్వయంగా కూర్చొని సమస్యలను పరిష్కరించడం సంతోషకరం
— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) December 8, 2023