కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి మల్లయ్య కుటుంబం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గడ్డం నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు మార్క హరికృష్ణ, కొక్కిస రమేష్, మానకొండూరు ఉపాధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు భాష బోయిన ప్రదీప్ యాదవ్, సాగర్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు