తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర సినీ & టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం హాయాంలోజరిగిన ఘోరమైన తప్పిదాలు మీ పాలనలో పునరావృతం కావనే ఆశిస్తున్నా. ఆ నమ్మకంతోనే తెలంగాణ ప్రజలు BRS ను గద్దె దించిండ్రు.
గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాను వెలికి తీసి ఆ డబ్బును తెలంగాణ సినీ కార్మికుల అభివృద్ది కోసం ఖర్చుపెట్టగలరు.
తెలంగాణ సినీ మరియు టివి కార్మికులకు న్యాయం చేసే ఏ కార్యక్రమంలో అయినా ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో అన్యాయం జరిగిన ప్రతిచోటా పేద సినీ మరియు టివి కార్మికుల గొంతుకగా నిలబడి రాజీలేని పోరాటం చేయడానికి వెనుకాడబోమని తెలిపారు.