- గుంతలమయంగా మారిన అర్&బి ప్రధాన రహదారి
- 20 కిలోమీటర్ల ప్రయాణం నరకయాతన
పల్నాడు జిల్లా, కారంపూడి : మాచర్ల – నరసరావుపేట ప్రధాన రహదారి నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారి. ప్రధాన రహదారిలో నరమాలపాడు నుండి కారంపూడి మీదగా గుత్తికొండ వరకు ప్రయాణం నరకయాతన .. ఎవరెస్టు శిఖరమైన అధిరోహించొచ్చు కానీ ప్రధాన రహదారిలో 20 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి అంటే అంతకన్నా ఎక్కువ సాహసం చేయాల్సిన పరిస్థితి దాపురించింది.. ఆర్ & బి రోడ్ లోనీ నరమాలపాడు నుండి కారంపూడి మీదగా గుత్తికొండ వరకు వెళ్లే రహదారిలో తారు రోడ్డును వెత్తుక్కోవల్సిన వెళ్లాల్సిన పరిస్థితి ప్రయాణికులకు దాపురించింది. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు అనేకమార్లు రహదారిలో నిత్యం తిరుగుతూనే ఉంటారు కానీ పట్టించుకున్న దాఖలాలు కనబడట్లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కారంపూడి లోని బస్టాండ్ సెంటర్ నుండి ఆర్ & బి బంగ్లా వరకు వాహనాలు నిత్యం రద్దీగా ఉండటంతో దుమ్ము ధూళి విపరీతంగా వస్తుంది. రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు, షాపులు యజమానులు రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్నారు. నరమాలపాడు నుండి గుత్తికొండ వరకు నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వారి యొక్క వాహనాలను గుంతల్లో పడకుండా తప్పించకునే క్రమంలో కిందపడటం ఏముకలు విరగటం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా మాచర్ల గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకొని నూతన రహదారిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.