పల్నాడు జిల్లా, మాచర్ల : పట్టణంలోని శ్రీశైలంరోడ్లో ఉన్న జీసస్ ప్రామిసెస్ ఇవాంజిలికల్ ఫెలోషిప్(జెపిఇఎఫ్)చర్చిలో పాస్టర్ పొట్టిపోగు మరియదాస్ అద్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ ప్రాముఖ్యతను గూర్చి ముఖ్యఅతిథి డొక్కా రవికుమార్ వివరించారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ సందేశాన్ని గూర్చి ప్రదర్శించిన నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వచ్చిన విశ్వాసులకు భారీ ప్రేమ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బుట్టి పూర్ణచంద్ర కుమార్, సంఘ పెద్దలు మాచర్ల పెద్ద యేసోబు, గోగుల పాల్రాజ్, కడియం పాపయ్య, ఆలేటి ఎలీషా, కడియం వెంకట్రావ్, కడియం పిచ్చయ్య, కడియం పున్నయ్య, కొమ్ము నాగేశ్వరరావు, కొమ్ము ఏసోబు, కడియం నాగయ్య, కొమ్ము యేసయ్య, కొమ్ము మోషే, కొమ్ము చిన్న కాటయ్య, కొమ్ము చిన్న ఎంకులు, కడియం రవి తదితరులు పాల్గొన్నారు.