ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆశావహుల నుంచి ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. ఆయా గ్రామాలు… వార్డులలో అధికారులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు పత్రాలు ఇవే.