కారంపూడి మండల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు,ప్రజలకు మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాల టీడీపీ నాయకుల నూతన సంవత్సర క్యాలెండర్ ను బ్రహ్మా రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మా రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని అందరూ సుఖసంతోషాలతో వుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.