హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది, మాదాపూర్ పోలీసులు చేరుకున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.