- ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎస్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ
- నెల 6 తారీకు వచ్చినప్పటికీ జీతాలు రాకపోవడం బాధాకరం ఉపాధ్యాయులు ఆవేదన
- బ్యాంకులో లోన్లు తీసుకున్నాం పెనాల్టీలు వేస్తారని విచారం వ్యక్తపరిచారు
- ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు మంజూరు చేయాలని ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పోచయ్య డిమాండ్
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో శనివారం నాడు ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పోచయ్య ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ మాసాయిపేట, కొప్పులపల్లి, చెట్లా తిమ్మాయిపల్లి గ్రామాల స్కూల్లో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించే అసంబంధమైన ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నతి కార్యక్రమాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరో తారీకు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు పడకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన వాపోయారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు బ్యాంకులలో తీసుకున్న హౌసింగ్ లోన్స్ గాని పర్సనల్ లోన్స్ గాని ఈ టైంలో చెల్లించకపోతే పెనాల్టీలు పడడమే కాకుండా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని అయినా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చే మూడు డీఏలను ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే పోశయ్య డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వం ఆనాడు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ లు పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పోచయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు వరాల నరసింహులు మాసాయిపేట మండల అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, ఎస్టియు జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, బాల్రాజ్, శంకరంపేట్ మండల ప్రధాన కార్యదర్శి జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.