వచ్చే జూన్‌లో ఐరోపా సమాఖ్య పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2024 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ రెండింటిని ఎదుర్కొడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఓ అస్త్రాన్ని బయటకు తీశారు. ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి ఓ గే యువకుడ్ని ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తన మంత్రి వర్గంలో విద్యా శాఖ బాధ్యతలు చూస్తోన్న 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ను ప్రధానిగా నిర్ణయించారు.
ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవికి ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నూతన ప్రధానిని నియమించారు.గాబ్రియెల్ అట్టల్ కరోనా సమయంలో ఎంతో చురుగ్గా వ్యవహరించడం మేక్రాన్ ను ఆకట్టుకుంది. ఫ్రాన్స్ ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా గాబ్రియల్ అట్టల్ నిలిచిపోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్ వస్తున్నాయి.
స్వలింగ సంపర్కులు కీలక పదవులు చేపట్టడం కొత్తేమీ కాదు. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ తాను గే అని బహిరంగంగా ప్రకటించి గతంలో సంచలనం సృష్టించారు. లియో వరాద్కర్ భారత సంతతికి చెందిన వ్యక్తి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా స్వలింగ సంపర్కుడు అంటూ గతంలో చాలా కథనాలు వచ్చాయి. ఆయన ఓసారి గే బార్ ను సందర్శించడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
#BREAKING President Macron names Gabriel Attal as France's youngest, first openly gay PM: presidential sources pic.twitter.com/We8QfNXwTy
— AFP News Agency (@AFP) January 9, 2024