కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని పారువెళ్ల గ్రామంలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు షాపుల్లో సుమారు 9000 విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖాసీంపేటలో సైతం 6 వేల విలువ గల మధ్య పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఈ దాడుల్లో ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ తీగల సంపత్, అంజయ్య, భూమయ్య, వెంకన్న పాల్గొన్నారు.