contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. ఒక మహిళతో అమర్యాదకరంగా ప్రవర్తించిన కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే… తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ మియాపూర్ పీఎస్ కు వచ్చింది. అయితే ఆమె పట్ల సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణ జరుపగా ప్రేమ్ కుమార్ బాగోతాలు బయటపడ్డాయి. దీంతో, ఆయనను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :