కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా తీసుకునే చర్యల్లో భాగంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వరుస స్పెషల్ డ్రైవ్ లు మరియు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ ఏసీపీ సర్వర్ మాట్లాడుతూ సోమవారం కరీంనగర్ కమీషనరేట్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించమన్నారు. ఈ డ్రైవ్ లో కిటికీ అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ కవర్ వాడుతున్న కార్లు, వాహనాలపై దృష్టి పెట్టామన్నారు. అవి వాడే కార్లను గుర్తించి పట్టుకున్నామన్నారు. అప్పటికప్పుడు వాటిని తొలగించామన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా వాహన యజమానులు కార్ల కిటికీ అద్దాలకు ఎటువంటి బ్లాక్ ఫిల్మ్ లు ఉంచరాదని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు దాదాపు 50 వాహనాలను ఈ స్పెషల్ డ్రైవ్ తనిఖీల్లో గుర్తించామన్నారు. పట్టుబడిన కార్లకు ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినటువంటి వాహనదారులని గుర్తించడమే కాకుండా వారికి ఈ చలాన్ ద్వారా జరిమాన కూడా విధిస్తామన్నారు. కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రమేష్, ఖరీముల్లాఖాన్ తో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్, శనిగల శ్రీకాంత్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.