కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఈనెల 21 వ తేదీ నుంచి 24 తేదీ వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ముందుగా పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు, అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ బోయిని పోశయ్య, వైస్ చైర్మన్ ఘర్షకుర్తి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కూన ఎల్లయ్య, సహాయ కార్యదర్శి కొండ సత్యనారాయణ, కోశాధికారి బుర్ర అంజయ్య గౌడ్,కమిటీ సభ్యులు పురుషోత్తం కిషన్ గౌడ్, దేశరాజు కనకయ్య, కొలుపుల రవి, న్యాత సుధాకర్, మీసం ప్రభాకర్, కొండ శ్రీనివాస్,బుర్ర తిరుపతి గౌడ్,బుర్ర అనిల్ గౌడ్,బోయిని అంజయ్య, బోయిని మల్లయ్య, కూన మల్లయ్య, కూన ఎల్లయ్య, బుర్ర మల్లయ్య గౌడ్, గూడూరి రాజయ్య, మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.