contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

  • ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి…  ప్రొఫెసర్ కోదండరాం.

 

హైదరాబాద్ : విద్య వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు.

డిజెఎఫ్ జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు జర్నలిస్టుల పై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు.

వారికి విద్య వైద్యంతో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాల న్నారు.

అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీఇచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలంగా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :