అల్లూరి జిల్లా, అనంతగిరి: బొర్రాగుహలుకు వెళ్లే ప్రధాన రహదారి మలుపు మార్గం మధ్యలో రైల్వే గేటు వద్ద గతం లో కురిసిన మిచాంగ్ తుఫాన్ దాటికి రోడ్డు మార్గంనకు కొండ చరియాలు విరిగిపడ్డాయి. అప్పటినుండి ఈ రోడ్డు మార్గం మధ్యలో ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరంగా మారింది. అయితే ఈ రోడ్డు మార్గంలో వాహనాలు అదుపు తప్పితే ప్రమాదం ఖాయం మని వాహన సోదకులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ప్రమాద నివారణ సూచిక బోర్డులు పెట్టి, రక్షణ గోడలు నిర్మించి పెట్టాలని కోరుతున్నారు.