- అక్రమంగా తరలిస్తున్న మట్టి…. అడ్డుకున్న రెవిన్యూ అధికారులు
- రెవిన్యూ అధికారులు సైతం లెక్కచేయని వైసిపి నాయకులు..
పల్నాడు జిల్లా , కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామ పరిధిలోని అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామ విఆర్ఓ బండ్ల రామారావు జెసిబి మరియు ట్రాక్టర్లను పలుమార్లు అడ్డుకొని తోలకాన్ని నిలిపివేశారు. గ్రామ వైసిపి నాయకులు మాత్రం రెవెన్యూ అధికారులను సైతం లెక్కచేయకుండా అధికారులను మభ్యపెట్టి మట్టి తోలకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు ఉన్న కొద్దిసేపు మాత్రం ట్రాక్టర్లను జెసిబి నుండి అక్కడ నుండి పక్కకు పంపించి అధికారులు వెళ్ళగానే తిరిగి అక్రమంగా మట్టి తోలకాలు మొదలు పెడుతున్నారు. వడ్డెర కాలనీ దగ్గరలో ఉన్న పొలాల్లో మట్టిని తలలించడం వల్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడి వర్షాకాలంలో నీళ్లు నిలిచిపోయి పిల్లలు ఆడుకుంటూ నీటి గుంతలో పడి చనిపోయే ప్రమాదం ఉందని భయంతో గ్రామస్తులు మట్టిని అడ్డుకుంటున్నా లెక్కచేయని పరిస్థితిలో వైసిపి నాయకులు ప్రవర్తించడం పలు విమర్శలకు దారి తీస్తుంది.. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మట్టి తోలకాన్ని అడ్డుకొని జెసిబిలను ట్రాక్టర్లను సీజ్ చేసి అక్రమంగా మట్టి తరలిస్తున్న వైసిపి నాయకులపై కేసులను నమోదు చేయాలని గ్రామ ప్రజల అభిప్రాయపడుతున్నారు.