contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సిఎం రేవంత్ సొంత జిల్లాలో ల్యాండ్ మాఫియా .. కలెక్టర్ కి ఫిర్యాదు

  •  ల్యాండ్ మాఫియాపై…. కలెక్టర్ కు ఫిర్యాదు
  •  500 కోట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని వినతి
  •  మాజీ మంత్రి ఒత్తిడితోనే… మళ్లీ అనుమతులు
  •  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ….పెద్ద ఎత్తున ముడుపులు
  •  శ్రీనివాస్ గౌడ్ పై క్విడ్ ప్రోకో కేసులు నమోదు చేయాలి
  •  లేఅవుట్ కు అనుమతి ఇవ్వలేదు… కలెక్టర్ రవినాయక్
  •  అనుమతులు లేకుంటే అక్రమకట్టడాలను కూల్చివేయండి – సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 500 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా 25 ఎకరాల ప్రభుత్వ భూమిని మరోసారి కబ్జా చేసేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నిస్తుందని జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు సోమవారం ప్రవీణ్ ఫిర్యాదు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో ల్యాండ్ మాఫియా, అప్పట్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సదరు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆయన తెలిపారు. ఈ ల్యాండ్ మాఫియా కబ్జాలపై 2017లో తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేయగా
ప్రధానమంత్రి కార్యాలయం విచారణ జరపగా, అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఈ భూమి ప్రభుత్వ భూమి అని, ఏవ్వక్యూ ప్రాపర్టీ అని, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో డిటిసిపి అనుమతులను రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

  •  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ….పెద్ద ఎత్తున ముడుపులు

శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి రాగానే ల్యాండ్ మాఫియా 2021లో మళ్లీ అడ్డదారిన ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ప్రవీణ్ ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి మేరకే, టీఎస్ బైపాస్ పేరిట దొడ్డి దారిన తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి, తిరిగి ఆ భూమిని కబ్జా చేసేందుకు 2021 డిసెంబర్ మాసంలో మున్సిపల్ లేఅవుట్ ని అక్రమంగా పొందినట్లు ఆయన తెలిపారు.

ల్యాండ్ మాఫియాకు అక్రమంగా అనుమతులు కట్ట పెట్టినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పెద్ద ఎత్తున మూడుపులు అందాయని ప్రవీణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సదరు ల్యాండ్ మాఫియాకి చెందిన ఓ వ్యక్తికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కట్టబెట్టడం జరిగిందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారం క్విడ్ ప్రోకో కిందకి వస్తుందని, క్విడ్ ప్రోకో కింద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసులు నమోదు చేయాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

  •  లేఅవుట్ కు అనుమతి ఇవ్వలేదు. కలెక్టర్ రవినాయక్

ఇదిలా ఉంటే ల్యాండ్ మాఫియా కబ్జా చేసిన 500 కోట్ల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సోమవారం కలెక్టర్ రవి నాయక్ కు ఫిర్యాదు చేయగా, లేఅవుట్ కు అనుమలు లేవని, గతంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ అనుమతులు రద్దు చేశారని కలెక్టర్ స్పష్టం చేశారని ప్రవీణ్ తెలిపారు. లేఅవుట్ అనుమతులు లేకుంటే ఇండ్లు ఎలా కడుతున్నారని, సబ్ రిజిస్టార్ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని కలెక్టర దృష్టికి తీసుకుపోగా, రిజిస్ట్రేషన్ చేయొద్దని సబ్ రిజిస్టార్కు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ కు ఈ సందర్భంగా కలెక్టర్ రవి నాయక్ ఆదేశాలు జారీ చేశారని ప్రవీణ్ తెలిపారు.

  •  అనుమతులు లేకుంటే అక్రమకట్టడాలను….. కూల్చివేయండి

500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియాకు అనుమతులు లేవని సోమవారం కలెక్టర్ రవి నాయక్ స్పష్టం చేయడంతో అనుమతి లేని అక్రమ కట్టడాలని వెంటనే కూల్చివేయాలని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సదరు లేఅవుట్లో ప్రభుత్వ భూమి అంటూ పెద్ద ఎత్తున బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక దర్యాప్తు సంస్థ లేదా సీబీఐ చే విచారణ జరిపితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముడుపుల వ్యవహారంతో పాటు క్విడ్ ప్రోకో కింద ఎవరెవరు లబ్ది పొందారు అన్న విషయం బహిర్గతమవుతుందని ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :