పల్నాడు జిల్లా , కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థాన జీవద్వజ కీర్తిద్వజ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకున్నానని గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని దేవాలయాల ప్రతిష్ట కార్యక్రమాలు కూడా ప్రతిష్టాత్మంగా నిర్వహించామని అన్నారు ముందుగా గ్రామస్తులు పిన్నెల్లికి ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి అల్లయ్య, జడ్పిటిసి షేక్ షఫీ, గ్రామ సర్పంచ్ సైదులు, వజ్రాల వెంకటరామిరెడ్డి, ఎర్రగురవారెడ్డి, శివారెడ్డి, వెంకటరెడ్డి, మండల కన్వీనర్ కొంగర సుబ్రహ్మణ్యం, చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి, పాతూరి రామిరెడ్డి అల్లు వెంకటేశ్వరరెడ్డి, ఆశం విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.