కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో శనివారం రోజున 35వ రహదారి భద్రత ఉత్సవాలు హెచ్.కె.ఆర్ రేణికుంట టోల్ ప్లాజా సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వాహనదారులకు పలు సూచనలు చేశారు, పాదచారులు రోడ్డుకు ఎడమవైపున నడవవలయును చిన్నపిల్లలు రోడ్డు దాటుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని పశువులను రోడ్డు పక్కన మేపరాదని ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు కట్టిన ప్రదేశమునకు వెళ్లరాదని. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపవద్దని అదేవిధంగా ఫోర్ వీలర్స్ వారికి సీటు బెల్టు ధరించి అనుమతించిన వేగంలోని వెళ్ళవలనని జనావాసములు ఉన్నచోట 40 స్పీడ్ కంటే ఎక్కువ పోకూడదని వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడరాదని రాంగ్ రూట్లో వెళ్లకూడదని దీనివలన ప్రాణాలకే ప్రమాదం అని పలు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో రేణికుంట టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు