రాజన్న సిరిసిల్ల జిల్లా:భూ కబ్జాలకి సంబంధించిన సమస్యలపై జిల్లా ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయండి, అమాయక ప్రజల బెదిరింపులకు గురి చేసి వారి భూములను కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చెరించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలానికి చెందిన గజభింకర రాధాబాయీ భర్త బాలాజి 1996 సంవత్సరంలో భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇటీవల తంగళ్లపల్లి కి చెందిన పెద్దూరు తిరుపతి అనే వ్యక్తి రాధాబాయీకి చెందిన 20 గుంటలు భూమిని బెదిరించి ఆక్రమించుకున్నాడు. రాధా భాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దూరు తిరుపతి మీద తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కి తరలించారు.
జిల్లా పరిధిలో భూ కబ్జాలకి సంబంధించిన, నకిలీ భూ పత్రాలు సృష్టించి బేధరింపులకు పాల్పడిన వారి వివరాలు, నెరప్రవృతి గురించి నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు అని వారిపై కఠిన చర్యలు తీసుకోవడంజరుగుతుందని అన్నారు. అమాయక ప్రజలను బెదిరిస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.