కరీంనగర్ జిల్లా:విజ్ఞానశాస్త్రమే మనిషిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించగలుగుతోందని మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం బెజ్జంకి మోడల్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన పరిశోధన నమూనాల ప్రదర్శనను తిలకించి వాటి పనితీరు,వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి దైనందిన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తోందని, ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేమన్నారు. భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన సేవలు అపారమైనవని,ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఆసక్తిని పెంచుకొని కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ అద్భుతాలు ఆవిష్కరించే వారు భావిత రాలకు మార్గదర్శకులుగా నిలుస్తారన్నారు.ఈ కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్జిత్ కౌర్ తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.