- శావల్యాపురం మండలం వేల్పూరు లో సంఘటన,
వినుకొండ:- నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం నిర్వహించాడని ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టరు పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు…
విచారణ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 11 న శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో ఒక వ్యక్తి చెట్టు పై నుంచి ప్రమాదపుశాక్తూ పడి మృతి చెందాడు. ఈసంఘటన పై శావల్యాపురం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు సమాచారం. కేసు నమోదు అయిన సందర్భంగా మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలి. కానీ మృతదేహాన్ని పోలిసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించలేదు. (తరలించకుండా) ప్రైవేటు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన పై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పల్నాడు జిల్లా డి సి హెచ్చ్ ఎస్ డాక్టర్ రంగారావు విచారణ కు అదేశించారు. ఉన్నతాధికారి ఆదేశాలతో గురువారం జిల్లా అధికారి డాక్టర్ ఏడుకొండలు ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది ని విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పోస్టుమార్టం పై డాక్టర్ వ్రాత పూర్వకంగా వివరణ ఇచ్చారు.
(వాస్తవంగా మృతదేహం బాగా కుళ్లి పోయి, సంఘటన ప్రాంతం నుంచి తరలించడానికి వీలులేనప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని. కానీ ఇక్కడ మృతదేహాం ఢీ కంపోజ్ కాకుండానే ప్రైవేటు ప్రాంతంలో ఫోస్టుమార్టం చేశారని, పోలిస్ శాఖ ఏలా రిక్వెస్ట్ చేసారనేది తెలియవలసి ఉందని విచారణ అధికారి తెలిపారు)