సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలం గూడెం గ్రామం 2017 లో గత ప్రభుత్వం తలపెట్టిన దళితులకు మూడెకరాల భూమి విషయంలో గూడెం గ్రామంలో 63:18 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. కానీ గ్రామంలో గ్రామ సభ పెట్టకుండా లబ్ధిదారులను గుర్తించకుండా గ్రామంలో ఉన్న స్థానిక నాయకులు వారికి దగ్గరగా ఉన్నా వ్యక్తులకు అలాగే అనర్హులకు భూమిని కేటాయించడం జరిగింది, అలా 34 మందిని సెలెక్ట్ చేశారు. అందులో భూమి అమ్ముకున్న వారు భూమి ఉన్న వారు కూడా వారితో కలిపి 34 మందిని జాబితా చేశారు. ఇంకా గ్రామానికి చెందిన 15 మందిని అర్హులు అయినప్పటికీ ఏమి భూమి లేని వారిని వదిలేసి గ్రామసభ పెట్టకుండా అర్హులను గుర్తించకుండా ఈ ప్రక్రియ చేశారు, 2017 నుండి ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీస్ కి తాసిల్దార్ ఆఫీస్ కి ఎంపిడిఓ ఆఫీస్ కి తిరుగుతూ ఎన్నో ఆర్జీలు పెట్టుకున్న ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు.. గత ప్రభుత్వంలో జోప్యం చేశారు. ఈ కొత్త ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగాలని వేడుకుంటున్నారు. న్యాయం జరగాలని గత నాలుగు రోజుల నుంచి బెజ్జంకి తాసిల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. అర్హులైన వారికి మూడు ఎకరాల భూమిని ఇప్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. శనివారం వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.