- కొప్పునూరులో వైఎస్ఆర్ విగ్రహం విధ్వంసానికి నిరసనగా కారంపూడిలో వైసీపీ రాస్తారోకో
పల్నాడు జిల్లా, కారంపూడి : దివంగత మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కొప్పునూరులో విగ్రహం విధ్వంసానికి పాల్పడ్డారు కొందరు. ఇది తెలుగుదేశం పార్టీ వారి పనే అని భావించిన కారంపూడి వైసీపీ నాయకులు స్థానిక బస్ స్టాండ్ సెంటర్ లోని నాగులేరు బ్రిడ్జి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత విగ్రహం విధ్వంసానికి నిరసనగా మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి. బ్రహ్మరెడ్డి, టీడీపీ నాయకులు నారా. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు వైసీపీ నాయకులు ఈ సందర్బంగా వైసీపీ నాయకులు ఎంపీపి బొమ్మిన. అల్లయ్య, దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ము. చంద్రశేఖర్, యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొంగర. సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు షేక్. అక్బర్ జానీ భాషా మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహ విధ్వంసానికి కారణం తెలుగుదేశం గుండాల పనే అని విగ్రహాలు విధ్వంసం చేయడం దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఈ సందర్బంగా టీడీపీ నాయకులకు వారు సవాల్ విసిరారు. దివంగత నేత వైఎస్. రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల ప్రజలలో సమూచిత స్థానాన్ని సంపాదించారాని అటువంటి మహానేత విగ్రహాన్ని విధ్వంసం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని పోలీస్ అధికారులు విగ్రహం విధ్వంసం చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి నిందితులను అరెస్ట్ చేయాలని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిందితుల పై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా వైసీపీ వారు పోలీస్ అధికారులను కోరారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ చంద్రబాబు, బ్రహ్మరెడ్డి డౌన్ డౌన్ అంటూ వారి దిష్టిబొమ్మలను వైసీపీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బస్ స్టాండ్ సెంటర్ లో జరగటంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాతూరి. రామిరెడ్డి, చింతల. శ్రీనివాసరావు, అంతరగడ్డ. ఏసోబు, చిలుకూరి. రవీంద్ర, నారమాలపాడు సర్పంచ్ రామడుగు. గురవయ్య, కిల్లా. కాశీ, కోరే. సత్యం, అన్నపరెడ్డి. రాము, కాలే. రాంబాబు, ఆశం. విజయభాస్కర్ రెడ్డి, అంజి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.