- తలారుపాడు ఆదివాసి గిరిజనులు!!
- రోడ్డు వేస్తామని – పశువులు నడవడానికి త్రోవ వేశారు!!
- రూ.2 కోట్ల 16 లక్షలతో గ్రావెల్ రోడ్డు వేసినట్లుగా రికార్డులు!!
- రోడ్లన్నీ గెడ్డలా మార్చేశారు!!
అల్లూరి జిల్లా, అనంతగిరి,ది రిపోర్టర్ టీవీ : అల్లూరి జిల్లా, అనంతగిరి పంచాయతీ, అనంతగిరి మండల కేంద్రం ఆనుకొని కిలోమీటర్ దూరంలో 12 తేనెపుట్, తలారపాడు పీవిటీజి ఆదివాసి 23గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. మా గ్రామానికి సంబందించిన రోడ్డు ఎర్త్ వర్క్ చేశారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ గేడ్డలుగా మారిపోయాయి. మెటల్ రోడ్డు వేసినట్లుగా ఎం బుక్ తయారుచేసి డబ్బులు అన్ని కూడా డ్రా చేశారు. నేటికీ మా నడవడానికి తోలు లేని పరిస్థితి. రేషన్ బియ్యంకి వెళ్లాలంటే 12 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని, అనారోగ్యం గురైతే డోలు మోత తప్ప వేరే మార్గం లేదని,తాగడానికి మంచి అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు,ఆదివాసి పివిటిజి గిరిజనులు అవడంవల్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇప్పటికైనా పిఓ సందర్శించి మా యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో గమ్మిల రాజు,టైగర్, గ్రామస్తులు వేడుకున్నారు.