హైదరాబాద్ : పోలీసులను రక్షక భటులు అంటారు. తన, పర, పేద, ధనిక భేదం లేకుండా సమాజంలోని పౌరుల సమస్యలపట్ల స్పందించి, వారికి రక్షణ కల్పిచండం వీరి బాధ్యత. ఇంతంటి బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి కొందరు భక్షక భటుల్లా తయారవుతున్నారు. తమ అధికారంతో సామాన్యులను దోచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీస్ రోడ్డు పై వెళుతున్న చిరు వ్యాపారులను ఆపి, నేను అడిగింది నాకు కావలి లేకుంటే నీ పై కేసు పెడతా అంటూ ద్విచక్ర వాహన ఫోటో తీసుకొని, నువ్వు ఇవ్వకుంటే నీ పై కేసు పెడతా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దురుసుగా ప్రవర్తించినట్టు బాధితుడి ఆరోపణలు. అధికారం ఉందని, సామాన్య ప్రజలపై జలుం చూపించడం ఎంతవరకు సమంజసం. ఇకనైనా అధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.