ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చని పేర్కొంది. వాట్సాప్ స్టేటస్లో జావెద్ అహ్మద్ అనే ప్రొఫెసర్ ఆర్టికల్ 370 రద్దును విమర్శించడంపై దాఖలైన కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. జావెదు వ్యతిరేకంగా గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.