కరీంనగర్ జిల్లా: వీణవంక మండల తాసిల్దార్ తిరుమల్ రావు సస్పెండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు, వీణవంకకు చెందిన రామిడి శివప్రియ అమెరికాలో ఉండగానే ఆమె పేరు మీద ఉన్న 22 గుంటల భూమిని సుకాసి సురేష్ పేరుమీద పట్టా చేశారు, దీనిపై ఈనెల 6న సురేష్, పూర్ణ చందర్, అక్బర్, ధరణి ఆపరేటర్ అరుణ్ లపై కేసు నమోదు అయింది, శాఖపరమైన నివేదిక మేరకు తాసిల్దార్ కు తెలిసే ఉద్దేశపూర్వకంగా పట్టా మార్పిడి జరిగిందని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ తాసిల్దార్ తిరుమల్ రావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.